Mobile Popup Ad
Mobile Popup Ad

అక్కడ పొదుపు.. ఇక్కడ హెలికాప్టర్ చక్కర్లు..

కలం, తెలంగాణ బ్యూరో : పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేలా ప్రధాని మొదలు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రుల వరకు కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించుకుంటున్నారు. పైలట్, ఎస్కార్ట్ కూడా లేకుండా ప్రయాణిస్తున్నారు. తెలంగాణ మంత్రులు (Telangana Ministers) మాత్రం హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోళ్లపై సమీక్ష జరిపేందుకు నలుగురు మంత్రులు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం ఆ రెండు జిల్లాలకు వెళ్తున్నారు.

పౌర సరఫరాలు, వ్యవసాయం, రోడ్లు భవనాలు, రెవెన్యూ మంత్రులు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరిగి రాత్రికి చేరుకునేలా షెడ్యూలు ఖరారైంది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు తిరిగి అక్కడికే చేరుకోనున్నారు. తొలుత నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులో వడ్ల కొనుగోళ్ళపై సమీక్ష చేసి ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో అదే అంశంపై రివ్యూ చేయనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు రిటన్ అవుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>