కలం, వరంగల్ బ్యూరో: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఓ పేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న దాడుల్లో సౌదీ అరేబియా (Saudi Arabia)లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన రవిగోపాల్ ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం సౌదీకి వెళ్లాడు. యుద్దం జరుగుతున్నందున ఇటీవల ఇరాన్ సౌదీపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో రవిగోపాల్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం.
Read Also: ఇరాన్ టు ఇండియా: రవాణా సవాల్
Follow Us On: Sharechat

