కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఆదాయం (Liquor Revenue) ఏటేటా భారీగా పెరుగుతోంది. గడిచిన పదేండ్లలో దాదాపుగా 400 శాతం పెరిగింది. రాష్ట్ర మొత్తం ఆదాయంలో ఎక్సైజ్‌శాఖ వాటా కీలకంగా మారింది. రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ ఆదాయం 2014లో కేవలం రూ.10 వేల కోట్లకుపైగా ఉంటే.. ప్రస్తుతం దాదాపుగా రూ.40,209 కోట్లకు చేరుకున్నది. కొత్త మద్యం దుకాణాలు, బార్ల ద్వారా వచ్చిన అద్దె, అప్లికేషన్ల ద్వారా వచ్చిన రూ. 5,189 కోట్ల ఆదాయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఒక్క సంవత్సరం ఈ ఇన్‌కమ్ రూ. 44,57 కోట్లకు చేరుకున్నట్లయింది. డిసెంబరు నెలలోనే 5,051 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది 2023 డిసెంబరులో రూ.4 వేల కోట్లకు పైగా ఉండేది. 2020-21లో లాక్ డౌన్ ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు జోరుగానే సాగాయి. గత 12 ఏళ్లలో సంవత్సరాల వారీగా అమ్ముడైన మద్యం, వచ్చిన ఆదాయం వివరాలు ఇవీ…
2015-16 రూ. 12,706 కోట్లు,
2016-17 రూ. 14,184 కోట్లు,
2017-18 రూ. 17,594 కోట్లు,
2018-19 రూ. 20,859 కోట్లు,
2019-20 రూ. 23,145 కోట్లు,
2020-21 రూ. 27,288 కోట్లు,
2021-22 రూ. 30,783కోట్లు,
2022-23 రూ. 35,145కోట్లు,
2023-24 రూ. 36,493కోట్లు,
2024-25 రూ. 34,600కోట్లు,
2025-26 రూ. 40,209 కోట్లు

