ఢిల్లీకి ‘డబుల్’ దడ.. 26 పరుగులకే 4 వికెట్లు ఫటాఫట్!

కలం, స్పోర్ట్స్​​ : లక్నో (LSG) బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ (DC) క్యాపిటల్స్‌ను ప్రిన్స్ యాదవ్ తన ‘రాజసం’తో వణికించాడు. కేవలం 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ వేసిన బంతులు ఢిల్లీ బ్యాటర్లకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్‌ను అవుట్ చేసిన తీరు అద్భుతం. 138.3 కి.మీ వేగంతో వచ్చిన ఇన్‌స్వింగర్‌ను అక్షర్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ బంతి అనూహ్యంగా వికెట్లను గిరాటేసింది. తన వెనుక వికెట్లు ఎగిరిపోవడం చూసి అక్షర్ నమ్మలేక బిత్తరపోయాడు.

అంతకుముందే ప్రిన్స్ యాదవ్ వేసిన మరో లెంగ్త్ బాల్‌ను భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పాతుమ్ నిశ్శంక (1) గాల్లోకి లేపాడు. కీపర్ రిషబ్ పంత్ వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో నిశ్శంక ఇన్నింగ్స్ ముగిసింది. రాహుల్ 0 (షమీ బౌలింగ్‌లో గోల్డెన్ డక్), నితీష్ రానా 15 (మొహ్సిన్ బౌలింగ్‌లో అవుట్), నిశ్శంక 1 (ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్), అక్షర్ పటేల్ 0 (ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్)గా వెనుదిరిగారు. ఒక లక్నో బౌలింగ్ చూస్తే ప్రిన్స్ యాదవ్ 1.3 ఓవర్లలో 10 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. మొహ్సిన్ ఖాన్ 1 ఓవర్ మెయిడెన్ వేసి 1 వికెట్ పడగొట్టాడు. షమి 2 ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>