Mobile Popup Ad
Mobile Popup Ad

పదవుల కోసం రాష్ట్ర విభజనను ప్రోత్సహించారు.. జగన్​పై మంత్రి నాదెండ్ల ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ మంత్రి నాదెండ్ల మనోహర్​ (Nadendla Manohar) వైసీపీ చీఫ్​ జగన్​ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్​ ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లు పార్లమెంట్​ లో చర్చకు వచ్చిన నేపథ్యంలో రాజధాని విషయంపై ఆయన స్పందించారు. ప్రజలు అద్భుతమైన మెజారిటీ ఇచ్చినప్పుడు ఐదేండ్ల పాలనలో ఏం చేశారని జగన్​ ను ప్రశ్నించారు. పరిపాలన చేతకాక పదవుల కోసం రాష్ట్ర విభజనను జగన్​ ప్రోత్సహించారని నాదెండ్ల ఆరోపించారు. మూడు రాజధానులు అనేది తుగ్లక్​ నిర్ణయం అని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను జగన్​ దుర్మార్గంగా అవమానించారని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతి పై ఏకగ్రీవ తీర్మానం ఆమోదం పొందడంతో.. పార్లమెంట్ లో కేంద్రం బిల్లు ప్రవేశపెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>