కలం, నిర్మల్: తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఆదివారం జర్నలిస్టులు సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీజేఏ జిల్లా అధ్యక్షుడు అరుగుల పోశెట్టి, జిల్లా కార్యదర్శి గంగాధర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సమాజ సేవకు కూడా అసోసియేషన్ సమాన ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంతియాజ్ అలీ, కార్యదర్శి రాజు గౌడ్‌తో పాటు అసోసియేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

