తెలంగాణలో ‘జనగణన’కు షెడ్యూల్ ఫిక్స్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సెన్సస్ (Telangana Janaganana) ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభం కానున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా హౌజ్ లిస్టింగ్ ప్రాసెస్ ఆ రోజు నుంచి మొదలవుతుంది. సుమారు నెల రోజులు పడుతుందన్న అంచనాతో జూన్ 9 వరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో నిర్దేశించిన సెన్సస్ గైడ్‌లైన్స్ గురించి ఇప్పటికే కసరత్తు చేసిన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో వివరించారు. రెండు ఫేజ్‌లలో జరగనున్న సెన్సస్ ప్రక్రియలో మొదటి విడతగా హౌజ్ లిస్టింగ్ జరగనున్నది. ఇందుకోసం మే 11 – జూన్ 9 షెడ్యూలు ఖరారైంది. సెకండ్ ఫేజ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నది. ఈ ఫేజ్‌లో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా దేశవ్యాప్తంగా మొత్తం సెన్సస్ రెండు ఫేజ్‌ల ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది.

హౌజ్ లిస్టింగ్‌కు 34 ప్రశ్నల ఫార్మాట్ :

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెన్సస్ (Telangana Janaganana) ప్రక్రియపై రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ పంపారు. లాంఛనంగా గెజిట్ కూడా విడుదల చేశారు. రెండు ఫేజ్‌లలో జరిగే ప్రక్రియ గురించి నిర్దిష్టమైన ప్రోగ్రామ్ కూడా తయారైంది. ఫస్ట్ ఫేజ్‌లో జరిగే హౌజ్ లిస్టింగ్ (ఇండ్ల గణన)కు మొత్తం 34 ప్రశ్నలతో ఒక ఫార్మాట్ రెడీ అయింది. ప్రతీ ఇంటిని ఎన్యూమరేటర్లు నాలుగైదుసార్లు విజిట్ చేసి కుటుంబ పెద్ద మొదలు అవసరమైన వివరాలన్నింటినీ ఫిజికల్‌గా తీసుకుని దాన్ని డిజిటల్ రూపంలో మొబైల్ యాప్ ద్వారా అప్‌‌లోడ్ చేస్తారు. ఇందుకోసం దాదాపు 90 వేల మంది సిబ్బంది అవసరమవుతారు. ప్రతీ ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి వివిధ స్థాయిల్లో నోడల్ అధికారులు కూడా నియమితులవుతారు. ఈ ప్రక్రియను సక్సెస్ చేయడానికి అన్ని విభాగాల కార్యదర్శులతో చీఫ్ సెక్రటరీ ఇటీవలే సమావేశం నిర్వహించారు. ఏయే డిపార్టుమెంటు నుంచి ఎంత మంది సిబ్బందిని సమకూర్చాల్సిందీ వివరించారు.

 

View this post on Instagram

 

A post shared by Kalamdaily (@kalamtelugu)

Read Also: వీడ్కోలా? పొడిగింపా? స్టేట్ మీడియా అకాడమీ చైర్మన్ పోస్టుపై సస్పెన్స్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>