కలం, యాదగిరిగుట్ట: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సర్వోదయ తెలంగాణ సాధించడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) పని చేస్తుందని ఆ సంస్థ స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో జరగనున్న నూతన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సుజిత్ రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన ఉద్యమకారుల, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయన్నారు. సామాజిక తెలంగాణ కోసం నిరంతరం పోరాడతామని, కల్వకుంట్ల కవిత (Kavitha) సారథ్యంలో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) రాబోయే రోజుల్లో సంపూర్ణ తెలంగాణ సాధన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించబోతోందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేసే శక్తులను గద్దె దించి, సామాజిక న్యాయమే పునాదిగా కొత్త ప్రయాణం మొదలవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 25న మునీరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుంచి ఉద్యమకారులు, ప్రజలు, జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు సుజిత్ రావు, రాష్ట్ర నాయకులు మందడి సోమిరెడ్డి, జిల్లా స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ కౌంటర్
Follow Us On: Instagram

