Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ రోజు నుంచే అడ్మిషన్స్!

కలం, వెబ్ డెస్క్: ఇంటర్ (Intermediate Admissions) ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అభిలాష అభివన్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సారి ప్రవేశాల్లో కీలక నిబంధనలు పొందుపరిచారు. విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు సమర్పించాలి. అలాగే, యాంటీ డ్రగ్ సర్టిఫికేట్ పైనా సంతకం చేయాల్సి ఉంటుంది. గంజాయి, డ్రగ్స్ తీసుకోబోనని.. ఒకవేళ అలా చేస్తే.. యాజమాన్యం తీసుకునే ఎలాంటి కఠిన చర్యలకైనా సిద్ధంగా ఉంటాననేది ఆ సర్టిఫికేట్ సారాంశం. అడ్మిషన్ తీసుకునేటప్పుడు విద్యార్థి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేట్ సంతకం తీసుకుంటారు.

తొలుత గందరగోళం.. సీఎం సమీక్షతో

వాస్తవానికి, ఈ నెల 8వ తేదీనే ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ విద్యను కూడా పాఠశాల విద్యతో కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. ఈ షెడ్యూల్ నిలిపివేసింది. దీనిపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేసి.. ఈ విద్యా సంవత్సరం యథావిధిగానే షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి మాత్రం.. ఇంటర్ విద్యను ఎత్తివేసి, పాఠశాల స్థాయిలోనే కలపబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>