కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అస్సాం చేరుకున్నారు. అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారానికి వెళ్లిన వారిని ఆ రాష్ట్ర మంత్రి రనోజ్ పెగు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అస్సాం సంస్కృతికి ప్రతీకలైన జాపి టోపి, గమోసా కండువాతో చంద్రబాబు, లోకేశ్ ను సత్కరించారు. ఈ వేష ధారణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త అవతారంలో చంద్రబాబును చూసిన ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ పర్యటన ముంగించుకున్న సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ తో కలిసి అస్సాంకు వెళ్లారు. గౌహతిలో జరిగే హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

