ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్​కు పరీక్ష

సెంట్రల్​ డెస్క్​, కలం: ఆరుబయట ఆటపాటలతో గడపాల్సిన బాల్యం.. నాలుగు గోడల నడుమ అరచేతిలోని ఆరు అంగుళాల స్క్రీన్​కే (Screen Addiction) పరిమితమైపోతున్నది. ఒకప్పుడు పిల్లలు మారాం చేయకుండా ఉండటానికో, అన్నం తినిపించడానికో తల్లిదండ్రులు స్వయంగా పరిచయం చేసిన ఈ డిజిటల్ బొమ్మే ఇప్పుడు వారి జీవితాలను శాసిస్తున్నది. కరోనా కాలంలో ఆన్​లైన్​ క్లాసుల పేరుతో మొదలైన ఈ అనివార్య అలవాటు ఇప్పుడు ప్రమాదకరమైన వ్యసనంగా తయారైంది. పిల్లలను ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచడం తల్లిదండ్రులకు పరీక్షలా మారింది. వద్దంటే వినడం లేదని, మొండి చేస్తున్నారని, సూసైడ్​ టెండెన్సీ కనిపిస్తున్నదని పేరెంట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్ గాడ్జెట్​ వ్యసనం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గంటల తరబడి కదలకుండా ఫోన్లు చూడటం వల్ల చిన్న వయసులోనే ఊబకాయం, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఫోన్ చూస్తూ తల వంచి కూర్చోవడం వల్ల మెడ నరాలు, వెన్నెముకపై ఒత్తిడి పెరిగి టెక్స్ట్ నెక్ వంటి నరాల సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రిపూట ఎక్కువసేపు స్క్రీన్లు చూడటంతో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, విపరీతమైన కోపం వంటి రుగ్మతలు పెరిగిపోతున్నాయి.

న్యూక్లియర్​ ఫ్యామిలీలు పెరిగిపోతుండటం, పిల్లలను ఆడించేవాళ్లు ఇంట్లో లేకపోవడం, తోటివాళ్లతో గడిపేందుకు తల్లిదండ్రులు టైమ్​ ఇవ్వకపోవడం, రోజువారీ పనుల్లోనే పేరెంట్స్​ మునిగితేలుతుండటం, అన్నింటికీ డిజిటల్ గాడ్జెట్స్​ను ఉపయోగిస్తుండటం వంటి కారణాలు పిల్లలను డిజిటల్​ బానిసలుగా మారుస్తున్నాయని సైకియాట్రిస్టులు అంటున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు మాత్రం.. డిజిటల్​ గాడ్జెట్స్​ నుంచి వారిని దూరం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్​ మీడియాను ఆస్ట్రేలియా, స్పెయిన్​, ఫ్రాన్స్​, బ్రిటన్ బ్యాన్​ చేశాయి. అమెరికాలోని టెక్సాస్​లో కొందరు తల్లులు వారి పిల్లలకు 8వ తరగతి (సుమారు 14 ఏండ్లు) పూర్తయ్యే వరకు స్మార్ట్​ఫోన్లు ఇవ్వొద్దని ‘Wait Until 8th’ అనే ఉద్యమాన్ని నడుపుతున్నారు. దీన్ని అక్కడి పాలకులూ ప్రోత్సహిస్తున్నారు. ఇండియాలో ఇలాంటివి సాధ్యమేనా? ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకుంటాయా? పిల్లలను డిజిటల్​ ఉచ్చు నుంచి బయటపడేస్తాయా? వీటన్నింటిపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Screen Addiction
Screen Addiction

Read Also: ఖజానాపై ఉద్యోగుల జీతాల భారం.. నెలకు ఆరు వేల కోట్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>