ఇంటర్ విద్యార్థులకు అలర్ట్‌: కెరీర్ మార్చేసే కొత్త కోర్సు వచ్చేసింది

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి సరికొత్త కోర్సును అందుబాటులోకి తీసుకువస్తోంది. అకౌంటెన్సీ, ఎకనామిక్స్, కామర్స్ కలయికతో రూపొందించిన ఈ ఏఈసీ కోర్సు (Inter AEC Course) ద్వారా యువతకు కార్పొరేట్ రంగంలో మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక రంగంపై పట్టు సాధించేలా ఈ పాఠ్యప్రణాళికను రూపొందించారు. డిగ్రీ స్థాయిలో కూడా ఈ కోర్సు కొనసాగించే వీలుండటంతో భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్ వైపు వెళ్లాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వేదికగా మారనుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ గ్రూపు ఎంతో దోహదపడుతుంది.

Read Also: సీనియర్ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఆ పెద్దాయన ఎవరో తెలుసా?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>