‘పెద్ది’ ట్రైలర్ లాంచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “పెద్ది” (Peddi). వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 4న రిలీజ్‌కి సిద్దం అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

ఇప్పటికే పెద్ది సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ తీసుకువచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్దం అయింది. పెద్ది (Peddi) మూవీ ట్రైలర్‌ను మేకర్స్ మే 16న భోపాల్‌లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించి గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Also:  భక్తులకు డబ్బు ప్రసాదంగా ఇచ్చే ఆలయం.. ఎక్కడో తెలుసా!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>