epaper
Monday, March 2, 2026
epaper

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టులో లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు(Panchayat Elections) హైకోర్టులో లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎన్నికలపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీఓ 46ను సవాల్‌ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యంత వెనుకబడిన కులాలకు తగిన రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు వాదించారు. బీసీ వర్గీకరణలో ఏ, బీ, సీ, డీ గ్రూపుల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ పిటిషన్‌పై ప్రాథమిక విచారణ నిర్వహించిన హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ దశలో ఎన్నికలపై స్టే విధించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ముందుకు సాగుతున్న తరుణంలో జోక్యం చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.

రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టత ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు, దీనిపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. పిటిషనర్ల వాదనలను పరిశీలించిన తరువాత మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసిన హైకోర్టు, అప్పటివరకు ప్రభుత్వం వివరణాత్మకంగా తన సమాధానం సమర్పించాలని పేర్కొంది. దీంతో, పంచాయతీ ఎన్నికలు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారమే కొనసాగనున్నాయి. మొత్తం మీద, రిజర్వేషన్లపై వివాదం కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Read Also: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై రేప్ కేసు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!