తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో బుధవారం, గురువారం మోస్తరు నుంచి  భారీ వర్షాలు కురువనునట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండానికి తోడు కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల 20.4 సెం.మీకి పైగా అత్యంత భారీ వర్షాలలు కురిసే అవకాశం కనిపిస్తోంది.. మరికొన్ని ప్రాంతాల్లో 11.5 సెం.మీ నుంచి 20.4 సెం.మీలోపు అతి భారీ వర్షాలు కురవనునట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ మేరకు రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలకు నేడు ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు గురువారం  రెడ్ ఎలర్ట్ జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>