తాడికల్ సర్పంచ్ దుర్గపు సుజాతకు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళి

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు దుర్గపు సుజాత (Durgapu Sujatha) ఇటీవల మృతి చెందడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. తాడికల్ గ్రామంలోని దుర్గపు సుజాత నివాసానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దుర్గపు సుజాత ఎనలేని సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి ఆమె చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. దుర్గపు సుజాత కుమారుడు, కుమార్తె చదువుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వారు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>