Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో డిజిటల్ విప్లవం.. స్కూల్ రిపోర్ట్ కార్డుల పంపిణీలో మీ సేవ రికార్డ్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల వార్షిక రిపోర్ట్ కార్డులు నేరుగా తల్లిదండ్రులకు చేరాయి. 18 లక్షలకుపైగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు మీ సేవ ద్వారా నేరుగా పేరెంట్స్ వాట్సాప్ నంబర్‌కు పంపించారు. ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌శాఖ ఆధ్వర్యంలో మీ సేవ ద్వారా నిర్వహించారు.

పేపర్‌లెస్ విధానంలో రిపోర్ట్ కార్డులు

విద్యార్థుల అకడమిక్ రికార్డులు స్కూల్‌కు వెళ్లకుండానే.. తక్షణం, సురక్షితంగా, పేపర్‌లెస్ విధానంలో తల్లిదండ్రులకు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం  18 లక్షలకుపైగా  విద్యార్థుల రిపోర్ట్ కార్డులు డిజిటల్‌గా పంపిణీ చేశారు. సబ్జెక్టుల వారీగా మార్కులతోపాటు, హాజరుశాతం కూడా నమోదు చేశారు. స్కూల్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా తల్లిదండ్రులకు నేరుగా ఫలితాలు చూసుకొనే అవకాశం దక్కింది.  ఈ విధానం పూర్తిగా పేపర్‌లెస్, సురక్షిత విధానమని ప్రభుత్వం (Telangana Govt) చెబుతోంది.

తల్లిదండ్రులకు సమయం ఆదా: శ్రీధర్ బాబు

ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులకు సాంకేతిక సేవలు చేరాలనే లక్ష్యంతో వాట్సాప్ ద్వారా రిపోర్ట్ కార్డులు అందించామని వెల్లడించారు. దీని ద్వారా ఆయా కుటుంబాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని, ఇది తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్‌కు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు సులభంగా, వేగవంతమైన సేవలను అందించడంలో మరోసారి విజయవంతం అయిందని చెప్పారు.

Read Also: ‘ RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>