కలం, వెబ్ డెస్క్ : అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ (Iran) మరోసారి అగ్రరాజ్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చమురు దాడుల విషయంలో కన్నుకు కన్ను సిద్ధాంతం ఫాలో అవుతాం అని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ సఖాబ్ ఎస్ఫహానీ స్పష్టం చేశారు. తమ ఆయిల్ కేంద్రాలపై దాడులు చేస్తే అంతే దీటుగా సమాధానమిస్తామన్నారు.
ఏ దేశాల భూభాగం నుంచి తమ దేశ చమురు బావులను లక్ష్యంగా చేసుకుంటే.. అదేవిధంగా అమెరికాకు సహకరించే దేశాల చమురు కేంద్రాలపై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. యూఏఈ, ఖతార్, సౌదీ, కువైట్ లోని ఆయిల్ కేంద్రాలపై ఎటాక్ చేస్తామని హెచ్చరించారు. అలాగే, పాకిస్తాన్ లో జరిగిన చర్చల వేళ ఇరాన్ (Iran) ప్రతినిధులు అమెరికాను ఇరుకున పెట్టారన్నారు. ఇంధన సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఇరానీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు.
Read Also: భువనగిరి కాంగ్రెస్‌లో ముసలం!
Follow Us On: X(Twitter)

