Mobile Popup Ad
Mobile Popup Ad

RBI కీలక నిర్ణయం.. పేటీఎమ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

కలం, వెబ్ డెస్క్: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ పేమెంట్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎమ్ పేమెంట్స్‌ బ్యాంక్ లైసెన్స్ (Paytm Payments Bank)ను రద్దు చేసింది. ఈరోజుతో పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని స్పష్టం చేసింది. డిపాజిటర్ల ప్రయోజనాలకు హానికరంగా పేటీఎం వ్యాపారం చేసిందని మండిపడింది. నిబంధనల ఉల్లంఘన, పలుమార్లు హెచ్చరించినా మారకపోవడం, డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

డిపాజిటర్ల ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా పేటీఎం బ్యాంక్ (Paytm Payments Bank) యాజమాన్య కార్యకలాపాలు ఉన్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంక్ వ్యవహారాలు కొనసాగిస్తే డిపాజిటర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని.. బ్యాంకును మూసివేసే ప్రక్రియను ప్రారంభించడానికి సంబంధిత హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Read Also: ఏప్రిల్ 27 తర్వాతే పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక.. ఎందుకంటే?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>