కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. నియోజకవర్గ పరిధిలో గ్రామీణ రహదారులు, వంతెనలు, క్రాస్ డ్రైనేజ్ పనుల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.33.70 కోట్ల వ్యయంతో 28 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి (రోడ్లు) శాఖ జి.ఓ.ఆర్.టి. నెం.425 ను ప్రకటించింది. ఈ నిధులతో సిద్ధిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో క్రాస్ డ్రైనేజ్ పనులు, వంతెనల నిర్మాణం, రక్షణ గోడలు, లో-లెవల్ కాజ్‌వేలు, స్లాబ్ కల్వర్టుల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇందులో సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో మొత్తం 15 పనులకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కోహెడ మండలంలో 10 పనులకు రూ.7.20 కోట్లు, హుస్నాబాద్ మండలంలో 2 పనులకు రూ.3.50 కోట్లు, అక్కన్నపేట మండలంలో 3 పనులకు రూ.4.30 కోట్లు కేటాయించారు. అదేవిధంగా హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో మొత్తం 5 పనులకు రూ.7.70 కోట్లు మంజూరు చేశారు. ఇందులో భీమదేవరపల్లి మండలంలో 4 పనులకు రూ.6.20 కోట్లు, ఎల్కతుర్తి మండలంలో ఒక పనికి రూ.1.50 కోట్లు కేటాయించారు. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో మొత్తం 8 పనులకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఇందులో చిగురుమామిడి మండలంలో 5 పనులకు రూ.5 కోట్లు, సైదాపూర్ మండలంలో 3 పనులకు రూ.6 కోట్లు కేటాయించారు.*
సిద్దిపేట జిల్లా
1. హుస్నాబాద్ మండలం మాలపల్లి – కుచనపల్లి బ్రిడ్జి నిర్మాణం 300.00 లక్షలు
2.కోహెడ మండలం విన్జాపల్లి – ఒడ్డెర కాలనీ (పెరుకలగడ్డ) CD వర్క్ 50.00 లక్షలు
3.కోహెడ మండలం గొట్లమిట్ట – నారాయణపూర్ బ్రిడ్జి రక్షణ పనులు 50.00 లక్షలు
4.కోహెడ మండలం గుండారెడ్డిపల్లి – బస్వాపూర్ (3/380 బ్రిడ్జి) రక్షణ పనులు 30.00 లక్షలు
5. కోహెడ మండలం గుండారెడ్డిపల్లి – బస్వాపూర్ (3/140 బ్రిడ్జి) రక్షణ పనులు 30.00 లక్షలు.
6. కోహెడ మండలం గుండారెడ్డిపల్లి – బస్వాపూర్ (5/925 బ్రిడ్జి) రక్షణ పనులు 50.00 లక్షలు
7.అక్కన్న పేట మండలం PWD రోడ్డు నుండి కొండమంజరుపల్లి – రెగొండ మధ్యలో HLB బ్రిడ్జి 300.00 లక్షలు
8. అక్కన్న పేట మండలం రామవరం – పోతారం-3 CD వర్క్ 50.00 లక్షలు
9. కోహెడ మండలం పందిళ్ల నుండి పర్వేద – నాకిరకొమ్ముల ఎక్స్ రోడ్ CD వర్క్ 205.00 లక్షలు.
10.హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ (NH రోడ్డు) – మీర్జాపూర్ CD వర్క్ 50.00 లక్షలు
11. కోహెడ మండలం కాచాపూర్ – పందిళ్ల బ్రిడ్జి నిర్మాణం 205.00 లక్షలు
12.సిద్దిపేట PWD రోడ్డు పందిళ్ల స్టేజ్ – హుస్నాబాద్ (పొట్లపల్లి మీదుగా) CD వర్క్ 50.00 లక్షలు
13. అక్కన్న పేట మండలం పె ద్ద తండా – అవుకుంట CD వర్క్ 50.00 లక్షలు.
14. కోహెడ మండలం నారాయణపూర్ – శ్రీరాములపల్లి CD వర్క్ 50.00 లక్షలు.
15. కోహెడ మండలం R&B రోడ్డు – సింగనాయక్ తండా CD వర్క్ 30.00 లక్షలు.
హనుమకొండ జిల్లా
16. భీమదేవరపల్లి మండలం కొప్పూర్ – జగన్నాథపూర్ కాజ్‌వే 60.00 లక్షలు
17. భీమదేవరపల్లి మండలం రాసూల్‌పల్లి – బంగ్లాపల్లి (హై లెవెల్ లేయిర్) HLB 160.00 లక్షలు
18.భీమదేవరపల్లి మండలం రాసూల్‌పల్లి – బొల్లొనిపల్లి HLB 160.00 లక్షలు
19. భీమదేవరపల్లి మండలం రాసూల్‌పల్లి – వీర్లగడ్డ తండా లో లెవెల్ కాజ్‌వే 240.00 లక్షలు
20. ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ – గోపాల్‌పూర్ HLB 150.00 లక్షలు
కరీంనగర్ జిల్లా
21.చిగురు మామిడి మండలం గాజాబండ CD వర్క్ 50.00 లక్షలు
22.చిగురు మామిడి మండలం గాజాబండ రిటైనింగ్ వాల్ 40.00 లక్షలు
23.చిగురు మామిడి మండలం రేకొండ – శ్మశాన వాటిక CD వర్క్ 100.00 లక్షలు.
24.చిగురు మామిడి మండలం పేచుపల్లి – పర్లపల్లి CD వర్క్ 80.00 లక్షలు
25. చిగురు మామిడి మండలం నవాబ్‌పేట్ – పొట్లపల్లి CD వర్క్స్ 230.00 లక్షలు
26. సైదాపూర్ మండలం సోమారం – రైకల్ (సైదాపూర్ మీదుగా) స్లాబ్ కల్వర్టులు 125.00 లక్షలు
27. సైదాపూర్ మండలం దుద్దెనపల్లి – మొగిలిపాలెం బ్రిడ్జి నిర్మాణం 350.00 లక్షలు
28. సైదాపూర్ గొడిశల – ఇప్పలనర్సింగాపూర్ (నల్లరామయ్యపల్లి మీదుగా) CD వర్క్స్ 125.00 లక్షలు
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హుస్నాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తూ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాల మంజూరు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు నియోజకవర్గ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

