Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి అభివృద్ధికి నిధులు.. ఉత్తర్వులు జారీ

కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 351 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించిన సందర్భంగా ఆలయం, పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా దేవాదాయ శాఖ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి ఆమోదించడంతో, మొదటి దశ పనుల కోసం దేవాదాయ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆలయ పునరాభివృద్ధి, పునరుజ్జీవన పనులను మూడు దశల్లో చేపట్టనుండగా, ఇందుకోసం మొత్తం రూ.586 కోట్లను కేటాయించనున్నారు.

ఈ నెల 27న శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా భద్రాచల (Bhadrachalam) సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదే వేదికగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన భద్రాద్రి ఆలయాన్ని, కోట్లాది మంది భక్తులు మెచ్చేలా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: మహిళా అభ్యర్థుల ఎంపిక పార్టీలకు ఛాలెంజ్

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>