వ‌రంగ‌ల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. లారీ ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్ మృతి

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లాలో బుధవారం రాత్రి జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదం ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన గొల్లపల్లి అరుణ్ (26) అనే యువకుడు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. అరుణ్ వరంగల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి తన బైక్‌పై వరంగల్ వెళ్తుండగా, ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అరుణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల‌ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: మహిళా అభ్యర్థుల ఎంపిక పార్టీలకు ఛాలెంజ్

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>