Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో చైన్ స్నాచింగ్: వృద్ధురాలి గొలుసు అపహరణ

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కార్పొరేషన్ పరిధిలోని గుట్టల బజార్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపుతోంది. ఇంటి ముందు నిల్చుని ఉన్న ఒక వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. గుట్టల బజార్ ప్రాంతానికి చెందిన యక్కల పుష్పవతి అనే వృద్ధురాలు తన ఇంటి ముందు నిలబడి ఉండగా, ముఖానికి కర్చీఫ్ కట్టుకుని బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి ఆమె మెడలోని గొలుసును తెంచుకుని పరారయ్యాడు.

సుమారు మూడు తులాల బంగారు గొలుసు చోరీకి గురవ్వడం, ఇంటి ముందు నిల్చున్న వారికి కూడా రక్షణ లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>