కలం, తెలంగాణ బ్యూరో: చాలా రాజకీయ పార్టీలకు మహిళలంటే చిన్నచూపు. వాటి దృష్టిలో మహిళలు ‘ఓటు బ్యాంకు’ మాత్రమే. నేతలుగా గుర్తించడానికి మనసొప్పదు, ప్రోత్సహించాలన్న చిత్తశుద్ధీ ఉండదు. ‘ఆకాశంలో సగం’ అంటూ గంభీర ఉపన్యాసాలు చేసినా టికెట్ల కేటాయింపు మొదలు నామినేటెడ్ పోస్టుల్లో, మంత్రివర్గంలో వారికి ప్రాధాన్యం అంతంతే. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, వారసులకే అవకాశాలు. మెజారిటీ రాజకీయ పార్టీలది అలాంటి పురుషాధిక్య భావజాలమే. రాబోయే ఎన్నికల్లో మాత్రం ‘చట్టసభల్లో 33% రిజర్వేషన్’ (Women Reservation) అమలు తప్పనిసరి. పార్టీల అధినేతలకు ఇష్టమున్నా లేకపోయినా మహిళలకు టికెట్లు ఇవ్వాల్సిందే. దశాబ్దాలుగా మహిళలను అణగదొక్కిన పార్టీలే ఇప్పుడు రాజకీయంగా ఎంకరేజ్ చేసి పాపులర్ లీడర్లుగా తయారు చేసుకోక తప్పదు.. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకా తప్పదు! ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వు అవుతుందో తెలియదు. డీలిమిటేషన్ అయిన తర్వాతే క్లారిటీ. అప్పటివరకూ వెయిట్ చేయకుండా అన్ని చోట్లా మహిళా లీడర్లను తయారుచేసుకోవడమే పార్టీల ముందున్న బిగ్ ఛాలెంజ్!
‘ఊపుతలేవు..’, ‘మంగళవారం మరదలు’, ‘ఆడపిల్లల్ని నా కోసం కన్నావా?..’… ఇలాంటి ‘ఇన్‌డీసెంట్’ వ్యాఖ్యలు చేసి అవమానించిన సీనియర్ నేతలు ఇక నుంచి మహిళలను సమాన స్థాయిలో గౌరవించక తప్పదు. ఇంతకాలం లీడర్లుగా గుర్తించడానికే నిరాకరించిన పురుష నేతలు ఇప్పుడు వైఖరి మార్చుకోవాల్సిందే. చట్టసభల్లో ఇక నుంచి మూడింట ఒకవంతుగా కనిపించే మహిళా ప్రజాప్రతినిధులపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ‘గ్యాస్ టాక్స్’ వేస్తే కఠిన చర్యలు.. హోటళ్ళకు వార్నింగ్
Follow Us On: X(Twitter)

