కలం, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ (Musi Project) పై సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు రెండు భారీ పైప్ లైన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇందులో ఒక్కో పైప్‌లైన్ సామర్థ్యం 10 టీఎంసీలు ఉండనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం ఇటీవల రూ.375 కోట్లు విడుదల చేసింది.

