లండన్ వీధుల్లో త్రిష స్పెషల్ వాక్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫైర్!

కలం, వెబ్ డెస్క్: సెలబ్రిటీలు బయటికి వస్తే చాలు వారి ప్రతి కదలికను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు అభిమానులు. ఈ తరహాలోనే లండన్ (London) వీధుల్లో త్రిష (Trisha) స్పెషల్ వాక్ చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఓ అభిమాని. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కానీ ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. లండన్‌లోని చైనా టౌన్ వీధుల్లో సినీ నటి త్రిష స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటిస్తున్నారు. బ్లూ జీన్స్, బ్లాక్ జంపర్‌ ధరించి సాధారణ లుక్‌లో హాయిగా వాకింగ్ చేస్తూ స్నేహితులతో క్వాలిటీ టైమ్ గడుపుతుండగా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియోపై ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోలో త్రిష లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నా.. ఆమె ప్రైవేట్ టైమ్‌ను అనుమతి లేకుండా వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టడంపై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ కోల్పోవాలా? అని మండిపడుతున్నారు. డిజిటల్ యుగంలో సెలబ్రిటీ ప్రైవసీకి హద్దులు ఎక్కడ? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో వారి వ్యక్తిగత క్షణాలను గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>