ఉద్యోగుల డీఏల‌పై స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం?

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్ని నెలలుగా పెండింగ్ డీఏ (Employees DA) (కరువుభత్యం)లను క్లియర్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. రెండు దఫాలుగా ఆందోళనలు కూడా చేశారు. తాజాగా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ సోమవారం చర్చలు జరిపింది. కానీ ఏమీ తేలలేదు.

దానికి కొనసాగింపుగా మంగళవారం సాయంత్రం సైతం మీటింగ్ కంటిన్యూ కానున్నది. పీఆర్సీ ఫిట్‌మెంట్ ప్రకటన, ఆరు పెండిగ్ డీఏల క్లియరెన్స్, సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు, ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను పునరుద్ధరించడంపై జేఏసీ ప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకు ఒక డీఏ, సంక్రాంతి పండుగకు మరో డీఏ(Employees DA)ను క్లియర్ చేయాలని భావిస్తున్నది. పీఆర్సీ విషయంలో ఈ నెల చివరకు చైర్మన్ నుంచి నివేదిక వస్తుందని, దాన్ని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమించాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

2024 జనవరి నుంచి డీఏలు పెండింగ్ :

రాష్ట్రంలో కాంగ్రెస్ 2023 డిసెంబరులో అధికారంలోకి రాగా 2024 జనవరి 1 నుంచి డీఏల పేమెంట్ లేదు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రెండింటిని మాత్రమే క్లియర్ చేసింది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి డీఏను ప్రభుత్వం ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారం 2024 జనవరి1, జూలై 1, 2025 జనవరి 1, జూలై 1, 2026 జనవరి 1 డీఏలు కలిపి మొత్తం 12.74% (ఉద్యోగుల బేసిక్‌లో) ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఆరో డీఏ జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ మెంట్ చేయాల్సి ఉన్నది.

త్వరలో కేంద్రం దీనిపై ప్రకటన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్సంటేజీని ఖరారు చేయనున్నది. ఈ డీఏను కూడా కలుపుకుంటే మొత్తం ఆరు డీఏలు అవుతాయి. ప్రస్తుతానికి ఐదు డీఏలకు ప్రభుత్వం తక్షణం పేమెంట్ చేయాల్సి ఉన్నది. 2024 జనవరి 1 డీఏ ప్రకారం బేసిక్‌లో 2.73%, 2024 జూలై 1 డీఏ కింద 3.64% చొప్పున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అందాల్సి ఉన్నది. ఈ రెండింటిలో ఒకదాన్ని దసరా పండుగకు, మరోదాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నది.

Also Read : సాగునీరు కోరితే సంకెళ్లు వేస్తారా?.. బండి సంజయ్, డీకే అరుణ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>