సమగ్ర అభివృద్ధి అనంతరం మారనున్న భద్రాచలం రూపురేఖలు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం (Bhadrachalam) దేవస్థానం, పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రూ.351 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల్లో  గోదావరి ఘాట్ అభివృద్ధికి రూ.75 కోట్లు, ఆలయ సముదాయం అభివృద్ధికి రూ.180 కోట్లు, దేవస్థానం పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ.96 కోట్లు కేటాయించారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.586 కోట్లుగా అంచనా వేయబడింది. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రేపు జరిగే శ్రీ రామనవమి (Rama Navami) వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) భద్రాచలానికి రానున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తైతే భద్రాచలం (Bhadrachalam) దేవస్థానం, పట్టణం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: శ్రీరామ నవమికి భద్రాచలం సిద్ధం.. క్షేత్ర విశేషాలు ఇవే..

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>