పెద్ది సెట్స్‌లో మెగా క్రేజ్.. ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ సెల్ఫీ వీడియో

కలం, వెబ్ డెస్క్: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ అభిమానుల్లో కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలను రేపుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్‌లో చరణ్ పాల్గొనగా, తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపారు. ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వందలాది మంది సెట్స్‌కు తరలివచ్చారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని చూసిన చరణ్ వారందరినీ కలుసుకున్నాడు. అభిమానులతో కలిసి సెల్ఫీ వీడియో దిగుతూ వారిని ఉత్సాహపర్చాడు. అభిమాన నటుడు సెల్ఫీలు ఇవ్వడంతో సెట్స్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగా పవర్‌స్టార్ గాయం నుండి పూర్తిగా కోలుకుని మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా విశ్రాంతి తీసుకున్న ఆయన, ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పెద్దిపై దృష్టి సారించారు.

Read Also: ఉదయం నిద్రలేవగానే తలనొప్పి వస్తుందా.. నిర్లక్ష్యం చేయొద్దు !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>