కలం, జోగులాంబ గద్వాల : అయిజ మండలం (Ieeja Mandal)లో చిన్న తాండ్ర పాడు గ్రామ శివారులోని బోయ తిరుమల్ కు చెందిన మామిడి తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం మేరకు ఆదివాదం ఎస్ఐ గురుస్వామి ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు పేకటారాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 9,110 నగదు, 6 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిల్, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గురుస్వామి తెలిపారు.

