కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు పబ్లిసిటీ కోసం రూ. 30 కోట్లు ఖర్చయింది (Global Summit Expenditure). తెలుగు, ఇంగ్లీష్, హిందీ దినపత్రికలు సహా కొన్ని మాగజైన్లు, టీవీ ఛానెళ్ళలో ప్రకటనలు, ప్రసారాలు (Telecast), ఔట్‌డోర్ పబ్లిసిటీ (Outdoor Publicity) కోసం ఈ రెండు రోజుల్లో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో మూడో వంతు పత్రికలకే వెచ్చించినట్లు ఆ శాఖ వర్గాల సమాచారం. స్మాల్, మీడియం, బిగ్ న్యూస్ పేపర్లకు రూ. 15.5 కోట్లు, ఐదు మేగజైన్లకు రూ. 1.1 కోట్ల చొప్పున యాడ్‌లు ఇచ్చింది. రాష్ట్రానికి చెందిన తెలుగు దినపత్రికలతో పాటు జాతీయ ఇంగ్లీష్, హిందీ దినపత్రికలకు కూడా యాడ్‌లు ఇచ్చింది. ఫ్రంట్‌లైన్, ది వీక్, ఔట్‌లుక్, ఇండియా టుడే లాంటి మేగజైన్లకు కూడా ఇచ్చింది. ఇవన్నీ కలిపితే యాడ్‌ల ఖర్చు రూ. 16.6 కోట్లకు చేరింది.
టీవీ ఛానెళ్ళు, ఔట్‌డోర్ పబ్లిసిటీకి రూ. 13 కోట్లు :
Global Summit Expenditure | నగరంలోని మెట్రో పిల్లర్లు (1500 చోట్ల) సహా వివిధ ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు పది రోజుల పాటు హోర్డింగులు (183 చోట్ల), ఫ్లెక్సీ బ్యానర్లకు (650 చోట్ల), డివైడర్ల దగ్గర (200 చోట్ల), మెట్రో రైల్ మీడియా ద్వారా (260).. యాడ్‌లకు దాదాపు రూ. 8 కోట్లు ఖర్చయింది. టీవీ ఛానెళ్ళకు ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు యాడ్ ఫిల్మ్స్ రూపంలో రూ. 2.38 కోట్లు ఖర్చయింది. ఆకాశవాణి, ఎఫ్ఎం ద్వారా ప్రకటనలకు రూ. 42 లక్షలు, రైల్వేస్టేషన్లు-బస్ స్టేషన్ల దగ్గర ఎల్ఈడీ స్క్రీన్‌ల ద్వారా పబ్లిసిటీకి మరో రూ. 27 లక్షలు, ఎయిర్‌పోర్టు దగ్గర (హైదరాబాద్ సహా చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లోనూ) వివిధ రూపాల్లో ఐదు రోజుల పబ్లిసిటీ కోసం రూ. 2 కోట్లు చొప్పున మొత్తం రూ. 13.07 కోట్లు ఖర్చయింది. అన్ని రూపాల్లో యాడ్‌లు, పబ్లిసిటీ కోసం మొత్తంగా రూ. 29.67 కోట్లు ఖర్చయినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ వర్గాల అంచనా.
Read Also: పాడైన గోధుమలు పంపారు.. నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం..
Follow Us On: Youtube


