తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ కె. రామకృష్ణారావు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగరవేశారు.

కాగా, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకున్న సమయం కంటే గంటన్నర ముందే వేడుకలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరుల స్థూపం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్య నేతలు నివాళి అర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>