Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన ఒక సందేశాన్ని పంచుకున్నారు. తెలంగాణ ప్రజలు తమ నూతన ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాలకు ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధాని కొనియాడారు. ఈ రాష్ట్రం అద్భుతమైన సంస్కృతి, చరిత్రతో పాటు ధైర్యసాహసాలు, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ కలని సాకారం చేయడంలో భాగంగా తెలంగాణ అభివృద్ధి పథానికి మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, విజయాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>