Mobile Popup Ad
Mobile Popup Ad

దోస్త్ మూడో దశ సీట్ల కేటాయింపు పూర్తి

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ (DOST)లో భాగంగా మూడో దశ సీట్ల కేటాయింపు పూర్తయినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యా కమిషనర్ సంయుక్తంగా ప్రకటించారు. మూడో దశలో 93,516 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మొదటి ఫేజ్ లో 65,466 మంది, రెండో ఫేజ్ లో 28,050 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. తక్కువ వెబ్ ఆప్షన్లు ఇవ్వడంతో 13,768 మందికి సీట్లు రాలేదని పేర్కొన్నారు.

కీలక సూచనలు ఇవే..

⏩ మూడో దశలో సీట్లు పొందిన విద్యార్థులు కచ్చితంగా జూన్ 26వ తేదీ నుంచి జులై రెండో తేదీలోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. లేకపోతే సీటు కోల్పోయే ప్రమాదం ఉంది.

⏩ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు రూ.500, రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.

⏩ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందినవారు సెల్ఫ్ రిపోర్ట్ చేసేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మాత్రం సీటు కోల్పోతారు.

⏩ ఫేజ–2లో సీటు పొంది రిపోర్ట్ చేసిన విద్యార్థి ఫేజ్–3లో కూడా సీటు పొందితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వెంటనే రెండో ఫేజ్ సీట్ రద్దవుతుంది.

కాలేజీలో రిపోర్ట్ ఎప్పుడు చేయాలంటే..

▶️ మూడు దశల్లో సీట్లు పొంది, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన వారు జూన్ 27 నుంచి జులై నాలుగో తేదీలోగా సంబంధిత కాలేజీల్లో కచ్చితంగా హాజరై CCOTP సమర్పించాలి. అప్పుడే కాలేజీలో సీటు అధికారికంగా ఖరారు అవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఇప్పటికే CCOTP సమాచారం వస్తుంది.

▶️ కాలేజీకి రిపోర్ట్ చేయకపోతే విద్యార్థి సీటు కోల్పోతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>