పునర్వసు నక్షత్ర వేళ.. ఖిల్లా రామాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఖిల్లా శ్రీ రఘునాథ ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా సోమవారం సీతారాముల కల్యాణం నిర్వహించారు. సామూహికంగా 60 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. అతి ప్రాచీన ఆలయం అభివృద్ధికి నగర ప్రజలు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణంను నాని పంతులు, సందీప్ తివారి, నారాయణ, సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆలయ ట్రస్టు చైర్మన్ గురు ప్రసాద్ , గౌరవ అధ్యక్షులు ముక్క దేవేందర్ గుప్తా , జీ. ఆర్. ఎంటర్ ప్రైజెస్ అధినేత రాజశేఖర్ గుప్త , ఎర్రం పూర్ణచందర్, ఎర్రంప్రభాకర్, అశోక్ , తాటి వీరేశం, పెంటయ్య, పోలా వీరేందర్, గజవాడ ధర్మరాజు ,మాజీ కౌన్సిలర్ అంబదాస్, రాఘవులు, ,హన్మండ్లు, సంజీవరావు ,గంగాధర్, ప్రవీణ్, డాక్టర్ ముక్క వినోద్ కుమార్ గుప్తా, గాలి నాగరాజు,డాక్టర్ వాణి, ధన్పాల్ నారాయణ, పెండ్యాల శ్రీనివాస్ ,వాసు తదితర దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. పుర ప్రముఖులు రాజ్ కుమార్ సుబేదార్, మీసాల శ్రీనివాసరావు, కొండ వీర శేఖర్, గుడిపల్లి రమేష్, కోవూరి జగన్, పడిగెల నాగనాథ్, కూతురు అశోక్ కుమార్, సంతోష్., కశ్యపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఈ సందర్భంగా అన్నదానం చేశారు. కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కళ్యాణానికి మంచి స్పందన లభించిందని తాటి వీరేశం తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రాచుర్యానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>