కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టే బాధ్యతను నిర్వర్తిస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్ గురైందని తెలుస్తోంది. మే 22 సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు సమాచారం. అయితే, 20 రోజులు గడుస్తున్నా హ్యాకింగ్ జరిగిన విషయాన్ని సైబర్ సక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. ఒకప్పుడు దేశంలోనే టాప్ సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారిక ట్విట్టర్ హ్యాండీల్ హ్యాకింగ్ కు గురికావడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రజలను సైబర్ నేరాల భారి నుంచి రక్షించాల్సిన సైబర్ సెక్యూరిటీ అధికారిక ఎక్స్ ఖాతానే హ్యాక్ కావడంపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
Read Also: గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫీచర్.. ఈ చిన్న సెట్టింగ్‌తో పెట్రోల్ ఆదా
Follow Us On: Instagram

