కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) ట్రెండ్ నడుస్తోంది. చిలిపి ప్రశ్న నుంచి విలువైన సమాచారం, శస్త్ర చికిత్సల వరకు ప్రతిదాంట్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో దానిని కొందరు మంచి కోసం వాడుతుంటే.. మరికొందరు చెడు పనుల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కేసు (Cyber Crimes) ల్లో ఎక్కవ శాతం ఏఐ ఉపయోగించి నేరాలు చేసినవే ఎక్కువగా ఉంటున్నాయి. డీప్ ఫేక్ (Deep Fake), ఫేక్ వాయిస్ జనరేట్ చేసి దుండగులు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో @TelanganaCOPs సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది.
ఏఐ (Artificial Intelligence) ని మంచికోసమే వాడాలని కోరింది. ఏఐతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని సూచించింది. వ్యక్తులను కించపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడొద్దని పేర్కొంది. విజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలని, అవగాహన కల్పించేందుకు మాత్రమే ఏఐని వాడాలని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దుర్వినియోగం చేసి చిక్కుల్లో పడొద్దని హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించాలని @TelanganaCOPs ఎక్స్ వేదికగా సూచించింది.
Read Also: ‘ఉపాధి హామీ’ ఆత్మను చంపేసే కుట్ర
Follow Us On: X(Twitter)


