Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్​ దేవరకొండ ఇంటికి సీఎం రేవంత్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​: ఇటీవలే వివాహం చేసుకున్న సినీనటుడు విజయ్​ దేవరకొండ ఇంటికి గురువారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లారు. వివాహ బంధంతో ఒక్కటైన కొత్త జంట విజయ్​–రష్మిక దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. విజయ్​ తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. అనంతరం విరోష్​ జోడీ, విజయ్​​ తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్​ దేవరకొండ కలసి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో గ్రూప్ ఫొటో దిగారు. ​కాగా, అంతకుముందు రిసెప్షన్‌కు రావాల్సిందిగా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్ళి రష్మిక ఆహ్వానించారు. అయితే, రిసెప్షన్ జరిగే రోజున ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉండడంతో హాజరుకాలేకపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కీలక అంశాలపై చర్చించేందుకు వెళ్ళి, మరుసటి రోజున హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం స్వయంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళి నూతన వధూవరులతో ముచ్చటించి వారిని ఆశీర్వదించారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>