epaper
Thursday, March 5, 2026
epaper

బ్యాంటన్​ ఔట్.. అదరగొట్టిన అక్షర్​

కలం, వెబ్​ డెస్క్​: భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్​ను భారత బౌలర్లు తిప్పలు పెడుతున్నారు. క్రీజులోకి రాగానే రెండు భారీ సిక్సర్లు బాది ప్రమాదకరంగా మారిన టామ్ బాంటన్‌ను అక్షర్ పటేల్(Axar Patel) అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. అక్షర్ వేసిన కాస్త ఎత్తైన బంతిని బాంటన్ స్లాగ్-స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా డిప్ అయ్యి బ్యాట్‌కు దొరకకుండా నేరుగా వెళ్లి లెగ్ స్టంప్‌ను ఎగరవేసింది. కేవలం 5 బంతుల్లోనే 1 ఫోర్​, 2 సిక్స్​లతో 17 పరుగులు చేసిన బాంటన్ అవుట్ అవ్వడంతో అక్షర్ పటేల్ గర్జించాడు. అక్షర్ తన మొదటి ఓవర్లోనే వికెట్ పడగొట్టి ఇంగ్లాండ్​ ఆశలపై నీళ్లు చల్లాడు. 7.3 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 95/4 స్కోరుతో ఉంది. అక్షర్ తన మొదటి ఓవర్​లోనే ఓవర్లలోనే 16 పరుగులిచ్చినప్పటికీ ఒక వికెట్ తీశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!