కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ మేరకు అజెండా అంశాలను ఖరారు చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు, జాబ్ క్యాలెండర్, పంటల మార్పిడి విధానం, ఫీజుల నియంత్రణతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై చర్చించి.. తుది నిర్ణయానికి రాబోతున్నారు.
సబ్ కేబినెట్ కమిటీల నివేదికల సమర్పణ..
కేబినెట్ సమావేశంలో భాగంగా సంక్షేమ పథకాల అమలుపై చర్చించబోతున్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులకు సంబంధించిన పథకాల అమలు స్థితిపై ఇప్పటికే నియమించిన మంత్రుల సబ్ కేబినెట్ కమిటీ నివేదికలు సమర్పించే అవకాశం ఉంది. అలాగే, గత మంత్రివర్గాల అమలు ఏ స్థాయిలో ఉందో.. కూడా సమీక్షించబోతున్నారు.

