Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద్యోగుల జీతంలో కోత.. బిల్లుపై క్యాబినెట్‌లో చర్చ !

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో (Telangana Cabinet Meeting) చర్చించనున్న అంశాలపై ఆసక్తి నెలకొన్నది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశమున్నది. తల్లిదండ్రుల గురించి పట్టించుకోని ఉద్యోగుల్లో ప్రతి నెలా 10% నుంచి 15% మేర కోత పెట్టి దాన్ని తల్లిదండ్రులకే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్న ఆలోచనను రెండు సందర్భాల్లో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులుగా చేరుతున్నవారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమం సందర్భంగా తొలుత సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పై వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొడంగల్‌లో ప్రణామ్, బాలభరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్న సందర్భంగానూ ఇదే అంశాన్ని నొక్కిచెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ సెషన్‌లోనే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం? :

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్లకు కార్యాచరణగా క్యాబినెట్‌లో (Telangana Cabinet Meeting) ఈ అంశంపై చర్చించి ఆమోదం లభించిన తర్వాత బిల్లును ఈ సెషన్‌లోనే ప్రభుత్వం టేబుల్ చేయాలనుకుంటున్నది. ఈ అంశంపై స్టడీ చేసి రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే చీఫ్ సెక్రటరీని సీఎం ఆదేశించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారడానికి నిర్వచనమేంటి?.. అలాంటి ఉద్యోగులను గుర్తించేదెలా?.. ఫిర్యాదులే అందుకు ఆధారంగా ఉంటాయా?.. తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమా?.. కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులకు మాత్రమేనా?.. పాత ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుందా?.. ఇప్పుడు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలనూ ప్రభుత్వం సేకరిస్తుందా?.. ఇలాంటి అనేక సందేహాలు నెలకొన్నాయి. వీటికి సంబంధించి క్యాబినెట్ భేటీలో చర్చ జరిగిన తర్వాత బిల్లు రూపకల్పన కొలిక్కి వస్తుంది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు సమస్య లేకపోయినప్పటికీ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటే క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ నెల 23 సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు ఒక కీలకమైన అంశమన్నది సచివాలయ వర్గాల సమాచారం.

Read Also: డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌ సీజ్

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>