Mobile Popup Ad
Mobile Popup Ad

సిద్దిపేటలో వెయ్యి కోట్ల పనులు ఆపేశారు : హరీష్‌ రావు

కలం, వెబ్ డెస్క్ : సిద్దిపేటపై సీఎం రేవంత్ రెడ్డి కక్షగట్టారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. రేవంత్ కావాలనే చాలా పనులు సిద్దిపేటలో (Siddipet) ఆపేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ ఎస్ హయాంలో సిద్దిపేటకు కేటాయించిన రూ.1070 కోట్ల పనులను నిలిపివేశారని హరీష్‌ చెప్పారు. సిద్దిపేటకు రావాల్సిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్ కు తరలించుకుని పోతున్నారంటూ హరీష్ ఫైర్ అయ్యారు. రంగనాయక సాగర్ టూరిజం ప్రాజెక్టును ఆపేశారని, రింగ్ రోడ్డును నిలిపివేశారని హరీష్‌ ఆరోపించారు.

బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ బిల్డింగ్ రద్దు చేశారని, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీ బిల్డింగ్, స్టేడియం పనులు, టూ టౌన్ పనులు, చిన్నకోడూరు రోడ్డు పనులు అన్నీ నిలిపేశారని హరీష్ సీరియస్ అయ్యారు. తన మీద కోపం నియోజకవర్గంపై చూపించిన సీఎం రేవంత్ (Revanth Reddy).. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేటకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్మెట్టలో ప్రారంభించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ బీఆర్ ఎస్ హయాంలోనే నిర్మించారని.. తాము కట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు సీఎం రేవంత్ ప్రారంభిస్తున్నారని హరీష్ (Harish Rao) చెప్పుకొచ్చారు.

Read Also: ఉద్యోగుల జీతంలో కోత.. బిల్లుపై క్యాబినెట్‌లో చర్చ !

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>