Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సీబీఐ విచారణకు సిఫార్సు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet)  కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, దీని వెనుక భారీగా అవినీతి జరిగిందని భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసింది. అదే ఏడాది అక్టోబరులో రిపోర్ట్ ఇవ్వగా.. దీన్ని న్యాయ సంబంధిత అంశాల కోసం అడ్వకేట్ జనరల్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు సీబీఐకి ఇవ్వాలని అంగీకరించింది.

సీబీఐ విచారణకు తీసుకుంటుందా..?

విద్యుత్తు ఒప్పందాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన పీసీ.ఘోష్ కమిషన్ నివేదికను ఇలాగే సీబీఐకి అప్పగించారు. ఆరు నెలలైనా.. ఆ కేసును సీబీఐ టేకప్ చేయబోగా, పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదని మంత్రులు పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, విద్యుత్తు కమిషన్ ఇచ్చిన రిపోర్టును అయినా సీబీఐకి విచారణకు స్వీకరిస్తుందా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>