కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉత్కంఠ రేపిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం వెలువడింది. ఈ హోరాహోరీ పోరులో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మమతా బెనర్జీపై 15,114 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకానొక సమయంలో మమతా గెలుపు ఖాయమని ప్రచారం నడిచింది. అయితే కొన్ని రౌండ్ల తర్వాత సువేందు మళ్లీ లీడ్‌లోకి వచ్చారు. ఇప్పటికే టీఎంసీకి ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగల్చగా మమతా బెనర్జీ ఓటమితో మరో గట్టి దెబ్బ తగిలింది.

