అన్ని వర్గాలనూ సంతృప్తిపర్చే ప్రజారంజక బడ్జెట్.. సందీప్ సుల్తానియా

కలం, తెలంగాణ బ్యూరో : ఈసారి బడ్జెట్ (Telangana Budget 2026) అన్ని సెక్షన్ల ప్రజలను సంతృప్తిపర్చేలా ప్రజారంజకంగా ఉంటుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా (Sandeep Kumar Sultania) వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇది తనకు మొదటి బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆర్థిక వనరుల సాధ్యాసాధ్యాలను గమనంలోకి తీసుకుని సారి ప్రజాకర్షక బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. అందుకే అన్ని వర్గాల ప్రజలనూ సంతృప్తిపరిచేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రపోజల్స్ విశ్లేషించి వాటికి తగిన నిధులను సిఫారసు చేయడం మాత్రమే తమ బాధ్యతగా ఉంటుందన్నారు. మంత్రివర్గంలో చర్చ జరిగి ఆమోదం పొందిన తర్వాతనే ఏ బడ్జెట్‌కైనా, నిధుల కేటాయింపులకైనా, కొత్త పథకాలకైనా సాధికారికత లభిస్తుందన్నారు. శాసనసభ్యులంతా చర్చించి ఆమోదం తెలిపిన తెలిపిన తర్వాతనే అది అమల్లోకి వస్తుందన్నారు. బడ్జెట్‌ రూపకల్పన సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరడంపైనా లోతుగా కసరత్తు చేయాల్సి వచ్చిందని, దానికి అనుగుణంగానే కేటాయింపులపై ప్రభుత్వానికి సిఫారసులు చేశామన్నారు.

ఆర్థిక శాఖ చేసిన సిఫారసులపై మంత్రివర్గం చర్చించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని, కొన్ని నిమిషాల ముందు వరకూ ఇలాంటివి సహజమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు ఫుల్ బడ్జెట్‌లను ప్రవేశపెట్టగా ఇప్పుడు మూడవది అసెంబ్లీకి వస్తున్నది. ఈసారి అసెంబ్లీకి, లోక్‌సభకు కలిపి జమిలి ఎన్నికలు వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నిర్దిష్ట గడువు 2029 మే నెలలో అయినప్పటికీ ఒక ఏడాది ముందుగానే జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలపైనా ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం 2029లోనే జమిలి ఎన్నికలు ఉంటాయని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. ఈ పరిస్థితుల్లో 2028లో జమిలి ఎన్నికలు వస్తే వచ్చే ఏడాది ప్రవేశపెట్టిది చివరి ఫుల్ బడ్జెట్ (Telangana Budget) అవుతుంది. లేదంటే 2027, 2028 మార్చి నెలల్లో రెండు ఫుల్ బడ్జెట్లు ఉంటాయి.

Read Also: ధాన్య సేకరణకు రూ. 22,700 కోట్లు.. ఎన్సీడీసీ నుంచి లోన్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>