కలం వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కావడంతోనే బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు యూరియా సమస్యపై నిరసన తెలిపారు. ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ హాల్‌లోకి ప్రవేశించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్(Congress) వచ్చింది.. రైతులను నిండా ముంచిందంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ దానిని తిరస్కరించారు. ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.
Read Also: గుత్తాను కలవనున్న కవిత.. ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై?
Follow Us On: Pinterest


