రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం: షబ్బీర్ అలీ

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూర్ మండలం, పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం (New PACS Governing Body Oath Ceremony) ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Mohammed Ali Shabbir) ముఖ్య అతిథిగా హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన PACS ఛైర్మన్‌గా ఇటిక్యాల సురేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఛైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులను షబ్బీర్ అలీ అభినందించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రైతులకు పంట రుణాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు సకాలంలో అందేలా PACSలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సహకార సంఘాలు కేవలం రుణాల పంపిణీకే పరిమితం కాకుండా రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించే సమగ్ర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, పంట రుణ మాఫీ, ఉచిత విద్యుత్, రైతు బీమా, సాగునీటి వనరుల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు, దోమకొండ సర్పంచ్ నరసయ్య, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నరేందర్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, తిరుమల గౌడ్, సందీప్, సుధాకర్‌రెడ్డి, మండల SC సెల్ అధ్యక్షుడు వినీత్, మధు, మాజీ సర్పంచ్ అంజలి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>