వైభవ్.. సచిన్ అవుతాడా? కాంబ్లీ అవుతాడా?: కపిల్ దేవ్

కలం, స్పోర్ట్స్: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే దానిపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) ఆసక్తికరమైన ప్రశ్న లేవనెత్తారు. వైభవ్ సచిన్ టెండూల్కర్‌లా గొప్ప స్థాయికి చేరుకుంటాడా, లేక వినోద్ కాంబ్లీలా మధ్యలోనే ఆగిపోతాడా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రశ్నలు రావడానికి ప్రధాన కారణం జట్టులో వైభవ్‌కు తగినన్ని అవకాశాలు రాకపోవడమే.

న్యూజిలాండ్‌తో జరిగిన ఇటీవలి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఉండటంతో అతడికి తుది జట్టులో స్థానం దక్కడం కష్టమైంది. ఈ అంశంపై స్పందించిన కపిల్ దేవ్, వైభవ్‌లో ప్రతిభకు ఎలాంటి కొదువ లేదని అన్నారు. చిన్న వయసులో అతడు ఆడే దూకుడు క్రికెట్ అందరికీ నచ్చుతుందని చెప్పారు.

అయితే, వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, జట్టులో క్రమం తప్పకుండా అవకాశాలు రావడానికి సమయం పడుతుందని కపిల్ (Kapil Dev) తెలిపారు. ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని కపిల్ సూచించారు. వయసు పెరిగే కొద్దీ డబ్బు, పార్టీలు వంటి ఆకర్షణలు చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో వినోద్ కాంబ్లీ కూడా అపార ప్రతిభావంతుడే అయినప్పటికీ, సరైన దారిలో నడవక తన కెరీర్‌ను కోల్పోయాడని గుర్తుచేశారు. మరోవైపు సచిన్ టెండూల్కర్ మాత్రం ఎంతో నిబద్ధతతో అగ్రస్థానానికి చేరుకున్నారని వివరించారు. వైభవ్ ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాడనేది ఇప్పుడే చెప్పలేమని కపిల్ పేర్కొన్నారు.

Also Read : ఐసీసీ ఛైర్మన్‌గా జై షా మళ్లీ ఎన్నిక!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>