కలం, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఓటమి పవర్‌ప్లేలోనే నిర్ణయమైందని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాల్ రావు (Yalaka Venugopal Rao) స్పష్టం చేశారు. 243 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి ఆరు ఓవర్లలోనే జట్టు లయ తప్పిందని ఆయన విశ్లేషించారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి కనీసం 80–90 పరుగులు చేసి ఉంటే ఫలితం మారేదని, కానీ కేవలం 59 పరుగులు మాత్రమే చేయడం పెద్ద లోటుగా మారిందని ఆయన పేర్కొన్నారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని అన్నారు.
పాతుమ్ నిస్సంక త్వరగా అవుట్ కావడంతో కేఎల్ రాహుల్‌కు సరైన స్ట్రైక్ రాకపోవడం జట్టును ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. పవర్‌ప్లేలో రాహుల్ కేవలం ఆరు బంతులు మాత్రమే ఎదుర్కొనడం అతని ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపిందని, నితీష్ రాణా కూడా వేగంగా పరుగులు చేయలేకపోయారని వివరించారు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో కూడా ఢిల్లీ నిరాశపరిచిందని వేణుగోపాల్ రావు అన్నారు. అభిషేక్ శర్మకు రెండు సార్లు లైఫ్ ఇవ్వడం మ్యాచ్‌ను దూరం చేసిందని తెలిపారు.
135 పరుగులు చేసిన ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు తమ ఫీల్డర్లు రెండుసార్లు లైఫ్ ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ రనౌట్ చేసే అవకాశాన్ని వదిలేయగా, నిస్సంక క్యాచ్ డ్రాప్ చేయడం తమ కొంపముంచిందని తెలిపారు. ఇలాంటి భారీ స్కోర్ల మ్యాచ్‌లలో చిన్న తప్పులు కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కుల్దీప్ యాదవ్‌కు తక్కువ ఓవర్లు ఇవ్వడం, పార్ట్‌టైమ్ బౌలర్లతో ఎక్కువగా బౌలింగ్ చేయించడంపై ఆయన స్పందిస్తూ, ఇవి మైదానంలో తీసుకునే తక్షణ నిర్ణయాలేనని పేర్కొన్నారు. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది.

