Mobile Popup Ad
Mobile Popup Ad

సమ్మె ఎఫెక్ట్.. పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం!

కలం, కరీంనగర్ బ్యూరో: ​ఆర్టీసీ సమ్మె (RTC strike) నేపథ్యంలో పెద్దపల్లి (Peddapalli) బస్టాండ్‌లో ఒక వింత పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న సమ్మె కారణంగా బస్సుల్లో కండక్టర్లు అందుబాటులో లేరు. దీంతో సాధారణంగా మహిళలకు మాత్రమే ఉండే ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇప్పుడు పురుషులకు కూడా లభిస్తోంది. బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో టిక్కెట్లు జారీ చేసే వారు ఎవరూ లేరు. దీనివల్ల పురుష ప్రయాణికులు కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు కొన్ని ప్రాంతాల్లో అధికారులు, పోలీసుల సహాయంతో ప్రైవేట్ బస్సు డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ఈ తరహాలో పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు స్వయంగా కరీంనగర్-2, గోదావరిఖని డిపో బస్సులను నడుపుతున్నారు. ఇది ఆర్టీసీ సమ్మె వల్ల ఏర్పడిన తాత్కాలిక పరిస్థితిగా చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>